సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కోస్తా ఆంధ్రాలో మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టాన్ని పంటల వారీగా వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. సుమారు రూ.5,245 కోట్ల మేర నష్టం నమోదైనట్లు అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం సాయం కోసం నివేదిక కూడా పంపింది. అదే సమయంలో పంట నష్టపోయిన రైతులకు ప్రతి హెక్టారుకు రూ.25వేలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అరటి పంటలకు అదనంగా మరో రూ.10వేలు కలిపి అందించ నున్నట్లు తాజగా ప్రకటించారు. దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు రూ.1500 చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంపై ఈనెల 11 నాటికి 100శాతం అంచనాలు సిద్ధమవుతాయని చెప్పారు. రైతులకు సకాలంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రేపు సోమవారం బాపట్ల జిల్లాలో, టీం టూ కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం టీం వన్ ప్రకాశం జిల్లాలో, టీం టూ కోనసీమ జిల్లాలో పర్యటించి బాధితులతో మాట్లాడతారు.
