సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు తరపు లాయర్లు తాజగా.. హైకోర్టు లో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. విచారణను ఈనెల19కి హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ లోని అంశాలకు సమాధానాలు ఇచ్చే నేపథ్యంలో కౌంటర్ దాఖలుకు సీఐడీ కొంత సమయం కోరగా.. హైకోర్టు అంగీకరించింది. మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ ఫై ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం చంద్రబాబు కు కొంత ఊరట నిచ్చే అంశం.. అలాగే చంద్రబాబుఫై మరో కేసు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ఫై విచారణ ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.
