సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం లభించింది. కూటమి నేతలు హర్షం ప్రకటించగా.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్తాడేపల్లి లో తన నివాసంలో మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. తమ వైసీపీ పార్టీ అమరావతి కి మాత్రమే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని.. అమరావతి రాజధాని చట్టబద్దమైన బిల్లు పేరుతొ సీఎం చంద్రబాబు తాను చేస్తున్న దేశంలో ఎక్కడలేని భారీ అవినీతి తో వేల కోట్లు దోచేస్తున్న వైనం నుండి అందరి ద్రుష్టి మరల్చేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు.తరువాత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, అసెంబ్లీ లో కొత్త బిల్లు తెచుకోవచ్చునని.. అయితే భవిషత్తులో మార్చేలేని రాజధాని బిల్లు తెచ్చానని ఆయన మాట్లాడటం కనీసం అవగాహనా ఉన్న ఎవరికైనా విషయం అర్ధం అవుతుందన్నారు. రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని తేల్చి చెప్పారు జగన్.ప్రజలందరికీ తెలిసిన విషయమే.. చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ నివాసాలు ,వీళ్ళ కుటుంబాలకు అడ్రెస్స్ లు ఇప్ప్పటికి హైదరాబాద్ లోనే.. చంద్రబాబు ప్రతివారం 2 రోజులు అక్కడే ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆంధ్ర వస్తారో ఎవరికీ తెలియదు. వీరికి అమరావతి లో నివాసం ఉండటానికే ఇష్టం ఉండదు. కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ప్రత్యక విమానాలలో షటిల్ సర్వీసులు చేస్తారు. వీరు రాజధాని అమరావతి అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నించారు. తాము అమరావతి రాజధాని ని వ్యతిరేకించలేదని ఎన్ని లక్షల కోట్లు పెట్టిన అభివృద్ధి కి దశాబ్దాలు పడుతుందని అందుకే ‘మావిగన్ప్లాన్-బి’ ని ప్రభుత్వానికి ప్రతిపాదించామని, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధాని చేయాలని జగన్ డిమాండ్ చేసారు.. అమరావతికి పెట్టే రూ.2 లక్షల కోట్లలో 10 శాతం పెడితే మావిగన్ భవిష్యత్తులో మంచి నగరం అవుతుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *