సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో హైదేరాబద్ తో సహా పలు ప్రాంతాలలో నేడు, శుక్రవారం శ్రీ గణేష్ ప్రతిమల నిమజ్జనోత్సవం సందర్భముగా ప్రభుత్వం శెలవు ప్రకటించింది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర వేడుకలను ను వీక్షించడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు .అయితే నేటి ఉదయం కూడా మహాగణపతి ఇంకా మండంలోనే ఉన్నాడు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ప్రధాన రోడ్డులు జలమయం అయ్యిన నేపథ్యంలో ఖైరతాబాద్ లో ఇంకా శోభాయాత్ర మూడు గంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వినాయక నిమజ్జనోత్సవాలకు ట్యాంక్ బండ్ (వద్ద బల్దియా (అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 33 క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 33 చెరువుల వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9 క్రేన్లు ఏర్పాటు అయ్యాయి. అలాగే పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు, 106 స్టాటిక్ క్రేన్లు, 208 మొబైల్ క్రేన్లను ఉంచారు. 40 వేల వినాయక విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. నగరంలో 10 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉన్నారు.
