సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని చార్మినార్‌లోని పాతబస్తీలో నేటి ఆదివారం ఉదయం 6.16 గంటలకు చార్మినార్, గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జి+2 భవనంలో మొదట కింది అంతస్తులో భారీ స్థాయిలో మంటలు చెలరేగి.. పై అంతస్తులకు వ్యాపించడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నేటి మధ్యాహననానికి అందిన సమాచారం ప్రకారం మొత్తం 17 మంది మరణించారు, మొదటగా 8 మంది మరణించారని భావించారు. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారన్నారు. మొత్తం 11 ఫైర్ వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు.. 70 మంది సిబ్బంది ఆపరేషన్లో పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి మొత్తం 2 గంటల సమయం పట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాద స్థలంలో పర్యటించి మృతుల కుటుంబాలకు 5 చప్పున ఎక్సగ్రేషన్ ప్రకటించారు. ఈ తీవ్ర దుర్ఘటన పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
