సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కోసం ఫుట్ పాత్ ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను అక్రమమైనవి గాభావించి నేడు, శనివారం జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. జగన్ భద్రత కోసం అంటూ నిర్మించిన ఈ సెక్యూరిటీ అవుట్ పోస్టు కట్టడాలకు అనుమతులు లేవని ఆరోపణలు వచ్చాయి. రోడ్డును ఆక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని, ఇవి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని, ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందాయి. నిజానికి జగన్ సీఎం అయ్యాక ఈ భవనానికి రావడమే అరుదు.. ఆయన సోదరి షర్మిల , తల్లి విజయమ్మ లోటస్ పాండ్ ఎక్కవ ఉపయోగించారు. అయితే జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. కాగా, జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇకపై ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *