సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గత 14 రోజులుగా సెట్స్ వేసి వైభవంగా గత శుక్రవారం రాత్రి నిర్వహించాలని భావించిన ” బ్రహ్మాస్త్రం’ సినిమా ప్రమోషన్ ఊహించని రీతిలో వినాయక ఉత్సవాలు లు నేపథ్యంలో పోలీస్ సిబ్బంది ని కేటాయించలేమని అధికారులు చెప్పడంతో స్థానిక ఒక హోటల్ లో చాల సింపుల్ గా నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయిన యంగ్ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీసులకు మనం సహకరించడం మంచిది. వారు మన మంచికోరే చెప్పి ఉంటారు అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఒత్తిడి ఎదుర్కొంటోంది. ఎందుకంటే ప్రేక్షకులకు ఇంకా ఏదో కొత్తగా కావాలి. ఆ ఒత్తిడి ఉన్నప్పుడే మనం బాగా చేయగలం. ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి. మన ప్రేక్షకుల కోసం మంచి సినిమాలు, గొప్ప చిత్రాలు తీయాలి.. తీస్తారనే నమ్మకం ఉంది. మా నాగార్జున బాబాయ్ నటించిన హిందీ చిత్రం ‘ఖుదాగవా’ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓ తెలుగు హీరో హిందీలో డైలాగులు చెబితే ఎలా ఉంటుందో తొలిసారి ఈ బ్రహ్మాస్త్రం లో చూసి తెలుసుకున్నాను’అన్నారు. అమితాబ్, నాగార్జున, ముఖ్య పాత్రలలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో ఈసినిమాని సమర్పిస్తున్నారు.
