సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: హైదరాబాద్ మహా నగరంలో నేడు, గురువారం పలు ప్రాంతాల్లో పెను గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ వేసవిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, చిక్కడపల్లిలో మంచు ముక్కలుగా వడగండ్ల వర్షం పడటం తో ప్రజలు నివ్వెరపోయారు. . హిమాయత్ నగర్, అంబర్ పేట, నల్లకుంట, రామంతపూర్ లో భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. రోడ్లన్నీ జలమయంకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మణికొండ, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, సికింద్రాబాద్‌లో, మాసబ్‌ట్యాంక్, నాంపల్లి, లక్డికాపూల్, మాదాపూర్, హైటెక్ సిటీ, మెహిదీపట్నం, టోలీచౌకిలో భారీ ఉరుములతో కూడిన వర్షం వచ్చింది. ఇంతటి వర్షంలోనూ హనుమాన్ జయంతి సందర్భముగా శోభాయాత్ర ను భక్తులు కొనసాగిస్తున్నారు,
