సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో నేడు, మంగళవారం మెట్రో ట్రైన్ లో ప్రయాణించాలనుకొనే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీ నగర్) మధ్య టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూ లో టికెట్ల కోసం ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికి కారణం..ఐదేళ్లుగా తమ జీతాల్లోపెరుగుదల లేదని ఆరోపిస్తూ.. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటిం గ్ ఉద్యో గులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. తమకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె ప్రభావంతో ఈ దుస్థితి వచ్చింది.. దీనిపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ధర్నా లో పాల్గొన్న వాళ్లపై చర్య లు తప్ప వని తాజగా హెచ్చ రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *