సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక గంట గట్టిగ వర్షం కురుస్తే హైదరాబాద్ రోడ్ల పరిస్థితి , ఆ నీటి మాడుగుల క్రింద మింగేసేలా ఉండే అండర్ డ్రైన్ మాన్ హోల్స్ సంగతి తెల్సిందే..అయితే హైదరాబాద్ గత రాత్రి కురిసిన కుండపోత వానతో ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. వందలాది కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి భాగ్యనగరం అంధకారంలో ఉండిపోయింది. ప్రధాన రోడ్లతో పాటు పలు బస్తీలలో నీరు చేరి ప్రజల పరిస్థితి ఎప్పటిలానే భయాందోనళకు గురిచేస్తుంది. ఇక మరో రోకటి పోటులా నేడు, మంగళవారం రాగల 6 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురవనుంది కాబట్టి అధికారులు హై అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి ఎవరూ బయటికి రావద్దు అంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కుండపోత కురిసింది. మిగిలిన జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి, మరి కొన్ని చోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల పొలాలు నీట మునిగాయి. నేటి మంగళ, రేపటి బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *