సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన పరిపాటి శ్రీనివాస్ ఇటీవల వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు ఆంధ్ర ప్రదేశ్ చైర్మెన్ గా ఎంపికైన నేపథ్యంలో భీమవరంలో ఆయన శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవహక్కులు రక్షణ, భూ వివాదాల లో అమాయకులకు రక్షణ కల్పించడానికి, పకృతి వనరులను సంరక్షించడానికి తాను కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు, ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ గా తనను నియమించారని తెలిపారు. ఈ నేపథ్యంలో త్యాగరాజ భవనం నందు పరిపాటి శ్రీనివాస్ కు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షులు ఓబిలిశెట్టి వెంకటేశ్వరరావు ప్రధాని కార్యదర్శి, తటవర్తి బద్రి ,కోశాధికారి కురిసేటి కన్నబాబు, పరుచూరి చిన్న నాగేశ్వరరావు తదితరులు ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది.
