సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకున్న బాధితుల కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాదితులు పిర్యాదు చేస్తే వారి ఫోన్లను తిరిగి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి బాధితులకు అప్పగించే ప్రక్రియ అద్భుత ఫలితాలు సాధిస్తుంది. భీమవరంలో ఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఇప్పటికే ఎన్నో లక్షల రూపాయలు విలువైన ఫోన్ లు తిరిగి బాధితులకు అందజేసి ప్రశంసలు పొందగా.. తాజగా ఏలూరు జిల్లాలో కూడా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఇప్పటి వరకూ ఐదు విడతలుగా సెల్‌ఫోన్లను రికవరీ చేశారు. రూ.41 లక్షల విలువ చేసే 207 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ తెలిపారు. ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో .. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9550351100 నెంబర్‌కు వచ్చిన ఫిర్యాదులు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇప్పటివరీ వివిధ రాష్ట్రాల నుంచి 808 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 5 విడతలుగా తాము బాధితులకు అందించిన సెల్ ఫోన్లవిలువ ఒక కోటి 46 లక్షల 78 వేలు ఉంటుందన్నారు. సైబర్‌ టీమ్‌, సీసీఎస్‌ పోలీసులు, మొబైల్‌ ట్రాకింగ్‌పై విశేషంగా కృషి చేస్తున్నారని ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *