సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండలు ముదురుతున్నాయి. మరో ప్రక్క విద్యార్థులకు పరీక్షల కోలాహలం మొదలు కాబోతుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1వ తేదీ నుంచి 20 వరకూ ఇంటర్మీడియట్, 17 నుంచి 31 లేదా ఏప్రిల్ 1 వరకూ పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి, పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి నిర్వహిస్తారు. ఈమేరకు పరీక్షా సెంటర్స్ లో విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చెయ్యడానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విద్య శాఖ అధికారులు సమన్వయ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.
