సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ నేడు, శుక్రవారం విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వ తేదీన చివరి ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్.. మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్..మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్..మార్చి 20న ఇంగ్లీష్..మార్చి 23న గణితం (మ్యాథ్స్)..మార్చి 25 ఫిజికల్ సైన్స్.. మార్చి 28న బయోలాజికల్ సైన్స్..మార్చి 30న సోషల్ స్టడీస్..ఏప్రిల్ 1న ఎస్ఎస్ సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)మార్చి 30వ తేదీతో మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టు (కాంపోజిట్ కోర్స్), ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్షలు ఉంటాయి.ఏప్రిల్ 1న ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2తో(సంస్కృతం, అరబిక్, పర్షియన్) పాటుగా.. ఎస్ఎస్ సీ వొకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలను నిర్వహిస్తారు.
