సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా తో భారత్ వాణిద్య ఒప్పదం కుదిరిన నేపథ్యంలో, దీనితో రష్యా నుండి భారత్ పెట్రోల్ నిలిపివేసిందని అమెరికా అడ్జక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇక చేసేది లేక రష్యా కూడా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్‌మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు సిద్ధమవుతుండడం బంగారం, వెండి ధరలు మరింత తగ్గిపోయి పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం( gold) ధర నేడు, సోమవారం (ఫిబ్రవరి 16న) మధ్యాహ్నం 1 గంట సమయంలో హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,56,440కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,310 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400కి చేరింది, నిన్నటి ధరతో పోల్చుకుంటే 1,200 రూపాయలు తగ్గింది. ఇక, వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది (Silver Rates ). మళ్లీ రూ.2.7 లక్షల మార్క్ దిగువకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు ఏకంగా రూ.7 వేల మేర తగ్గింది. హైదరాబాద్‌లో, విజయవాడలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.68 లక్షలుగా ఉంది.
