సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: . భీమవరం మండల పరిధిలోని యనమదుర్రు, గునుపూడి, భీమవరం లకు చెందిన పలువురు రైతులకు, నేడు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయం నందు 10 పవర్ టిల్లర్స్, ట్రాక్టర్ ను ఆయన రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల సంక్షేమానికి రెండు అడుగులు ముందుకేసారని, నేడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ మరో 10 అడుగులు ముందుకేసి రైతులకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. వైయస్సార్ యంత్ర సేవా పథకంలో సబ్సిడీతో కూడిన వ్యవసాయ పనిముట్లను రైతులకు అందిస్తూ వారికి అండదండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. 10 పవర్ టిల్లర్స్ కు, ఒక ట్రాక్టర్ కు సంబంధించి రూ 9 లక్షల 97 వేల 566 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందించిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *