సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 మున్సిపాలిటీల స్పెషల్ ఆఫీసర్ల గడువు ను పొడిగిస్తూ నేడు, మంగళవారం ప్రభుత్వం . ఉత్తర్వులు జారీచేసింది, వచ్చే 2023 ఏడాది మే 5 వరకు లేదా ఎన్నికలు జరిగే వరకూ గడువు పొడిగింపు చేయడం.. అందులో భీమవరం మున్సిపాలిటీ కూడా ఉండటం విశేషం.ఈ తాజా ఉత్తర్వులతో ఎప్పడు మునిసిపల్ ఎన్నికలు వస్తాయా? అని సుమారు 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా పలువురు రాజకీయనేతలుకు తీవ్ర నిరాశ ఎదురయింది అని చెప్పవచ్చు. మున్సిపాలిటీ ల స్పెషల్ ఆఫీసర్ల గడువు పొడిగింపు విధించిన పట్టణాల వివరాలు: భీమవరం రాజమహేంద్రవరం, రాజాం, పాలకొల్లు,తణుకు,తాడేపల్లిగూడెం, గుడివాడ,బాపట్ల,గూడూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ల స్పెషల్ ఆఫీసర్ల గడువు పొడిగింపు అమలులోకి వస్తుంది.
