సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల లో ఈనెల 10 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వరుసగా 10 రోజుల పాటు దేవాలయానికి ఉత్తరం వైపు నుండి వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచనున్నారు.తాజాగా నేడు, బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి (జనవరి 10) నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. పది రోజులులో ఏ రోజు ఉత్తరం వైపు నుండి శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు ఒకే రకమైన సిద్దిఫలాలు లభిస్తాయని తెలిపారు. ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. రేపు గురువారం తిరుపతి, తిరుమల కొండ ఫై ఏర్పాటు చేసిన మొత్తం 91 కౌంటర్లలో 1.2 లక్షల దర్శన టోకెన్లను భక్తులకు జారీ చేయనున్నట్లు తెలిపారు
