సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టాలీవుడ్‌లో గత 8 ఏళ్లుగా అందరి దృష్టిని ఆకర్షించిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నేడు, గురువారం అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. (ఫిబ్రవరి 26, 2026న) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం ఎంతో ఆత్మీయంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. తెలుగు హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం 10:10 గంటలకు విజయ్, రష్మిక మెడలో తాళి కట్టి ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించారు. మేళ తాళాల మధ్య ఈ వేడుక ITC మెమెంటోస్ (ఎకాయా) హోటల్‌లో జరిగింది. ఈ రిసార్ట్‌లో సుమారు 117 గదులు, ప్రీమియం సూట్లు, ప్రైవేట్ విల్లాలు ఉన్నాయి. ఈ వేడుక కోసం దాదాపు రూ.1 కోటి న్నర రూపాయలు పైగా మాత్రమే ఖర్చు చేసినట్టు సమాచారం. సుమారు 100 మంది మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. వీరిలో ఆలిండియా సూపర్ స్టార్ ప్రభాస్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకులు సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్రన్, శివ నిర్వాణ, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషిక రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ వంటి పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. మొదట తెలుగు ఆచారాల ప్రకారం పెళ్లి జరిగింది. అనంతరం నేటి సాయంత్రం 4:30 గంటలకు రష్మిక కర్ణాటకలోని కొడవ కుటుంబ సంప్రదాయం ప్రకారం మరోసారి పేళ్ళిజరగనుంది.
