సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఘనవిజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనకు నేటితో వంద రోజులు పూర్తి అయ్యాయి. ఈ 100 రోజుల పాలనకు గుర్తుగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నేటి 20వ తేదీ శుక్రవారం నుంచి ఈ నెల 26 వతేది దాకా ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ పేరుతో ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామంలో జరిగే ‘‘ఇది మంచి ప్రభుత్వం’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల వద్దకు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు వెళ్లనున్నారు. ఈ నెల 26 వరకు పాల్గొనేలా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ, వార్డు సభలు నిర్వహించి వంద రోజుల పాలనపై అవగాహన కలించేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహించేలా కూటమి సర్కార్ ప్రణాళికులు రూపొందించింది.
