సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో భక్తుల అర్ద మండలి దీక్ష కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ నిర్వహించినారు. 111 మంది భక్తులు శ్రీ అమ్మవారి మాల ధరించినారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పవిత్ర కార్తీకమాసంలో అఖండ జ్యోతి కార్యక్రమం ను గత బుధవారం రాత్రి ఆలయ ప్రధానఅర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ నిర్వహించినారు.అమ్మవారి మాలలు ధరించిన మాతలు మరియు భక్తులు ఈ కార్యక్రమం లో విశేషంగా పాల్గొన్నారు.
