సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్నగాక మొన్న కందుకూరు లో చంద్రబాబు సభకు వచ్చి 8 చెందిన దుర్ఘటన మరువక ముందే గత రాత్రి గుంటూరులో చంద్రబాబు.. ఇదేం కర్మ.. బహిరంగ సభలో తెలుగు దేశం పార్టీ మద్దతు దారులు చేప్పట్టిన ( ఉయ్యూరు ఫౌం డేషన్)సంక్రాంతికి చంద్రన్న ‘పేదలకు కానుకల పం పిణీ’ కార్యక్రమం లో జరిగిన తొక్కి సలాట ఘటనలో ముగ్గురు మృతి చెందటం తెలుగు రాష్ట్రాలలో ప్రజలు విస్మయానికి గురి అయ్యారు. దీనిపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య క్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వివరాలలోకి వెళ్ళితే…చంద్రబాబు గత ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు వేదిక వద్దకు చేరుకుని స్వ యంగా పేదలకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారని షెడ్యూ ల్లో పేర్కొ న్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచే పేదలను గ్రౌండులోకి అనుమతించారు. చంద్రబాబు సాయం త్రం 5.30 గంటలకు ప్రసంగం ప్రారంభించి 6.15 గం టలకు ముగించారు. అయితే సభ పూర్తీ అయ్యాక చంద్రబాబు కొద్దీ మంది మహిళలకు మాత్రం సంక్రాంతి కానుకలు అందచేయగా మిగతావారికి టీడీపీ నేతలు ఇస్తారంటూ వెళ్లిపోయారు.తదుపరి రాత్రి నిర్వాకులు మరి కొద్దీ మందికి మాత్రమే ఇస్తామని మిగిలిన వారందరికీ డివిజన్లలోకి వచ్చి పంపిణీ చేస్తామని ప్రకటించి ,టీడీపీ నేతలు వాహనాల నుండి విసురుతున్న కానుకల ప్యాక్ అందుకోవడానికి ఇచ్చినకాడికి అందిపుచ్చుకోవాలని ( 300 రూ విలువైన కిట్ ల కోసం..?) దూసుకొనిరావడంతో తీవ్ర తొక్కిసలాట జరగటం అందులో ముగ్గురు మహిళలు మరణించడం మరో 20 మంది తీవ్రంగా గాయపడటం జరిగింది. కొత్త ఏడాది కానుకలు తెస్తామని వెళ్లి త్రొక్కిసలాటలో మరణించిన తమ తమ తల్లుల మృతదేహాలను చూడవలసి వారి బిడ్డలా బాధ , వారి కుటుంబీకుల మనోవ్యధ అందరిని కదిలిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *