సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మ వారి 59 వార్షిక మహోత్స వాలను ఈ నెల 13 తేదీ నుంచి వచ్చే ఫిబ్రవరి నెల 10 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 90 లక్షల వ్యయంతో నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు 15 లక్షల రూపాయలు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధులు కేటాయించినట్లు, అమ్మ వారి ఉత్స వాల చివరి 9 రోజులపాటు దేవి అలంకరణలు చేస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనర్ యర్రం శెట్టి భద్రాద్రి మన సిగ్మా న్యూస్ కు తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నా నేపథ్యంలో నేడు, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో శ్రీమావుళ్ళమ్మవారిని దర్శించుకొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఉత్సవ కమిటీ , ప్రభుత్వ అధికారులు తో సమన్వయ పూర్వక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈసారి 59 వార్షిక మహోత్స వాలను గతంలో కన్నా ఘనంగా నిర్వహించాలని అందరు చక్కటి అవగాహన చేసుకొని పనిచేస్తే స్థానికులతో దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు శ్రీ అమ్మవారి అస్సిసులతో పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాలన్నారు. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మెన్ మానేపల్లి నాగన్నబాబు, నీరుల్లి కూరగాయ సంఘం అడ్జక్షులు రామాయణం గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *