సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయని విద్య శాఖ అధికారులు ప్రకటించారు. అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ఏడాది విద్యా కానుక కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు.ఇందులో యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సు లు, బెల్ట్, బ్యాగ్, ఇంగ్లిష్, తెలుగు (బైలింగ్వల్) టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్,డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది యూనిఫాం కుట్టుకూలినిరూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు. 20న ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లోనిలిచిన విద్యార్థులను ‘జగనన్నఆణిముత్యాలు’ పేరిట సత్కరించే వేడుక నిర్వహిస్తామన్నారు.
