సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు నిర్మూలించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని .. గడిచిన 120 రోజుల్లో ఇలాంటి ఘటనలు 110 జరిగాయని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా విమర్శించారు. ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతుంటే సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని? ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని, మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు.హోంమంత్రి అనిత సరిగా పనిచేయడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనడం వెనక కారణం ఏంటి?. దళితవర్గానికి చెందిన హోంమంత్రిపై నిందలు వేసి తాము చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా?. పిఠాపురం నియోజకవర్గంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినప్పుడు పవన్ ఎక్కడి వెళ్లారు?.. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగిలా పనిచేయమని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ చెప్పాలి. కానీ..డమ్మీ హోంమంత్రిని పెడితే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతోంది. రాష్ట్రంలో వారికీ నచ్చిన వారికి పోలీస్ అధికారులుగా పోస్టింగులు ఇచ్చుకుని ఇప్పుడు లైంగిక దాడులకు పాల్పడే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్లవల్లేరులో మాన, ప్రాణాలు పోయేలా విద్యార్థినిల ను రహస్య కెమెరాలతో వీడియోలు తీస్తే వారిని బెదిరించి విషయాన్ని కప్పిపుచ్చారు. ఈవీఎంలు మ్యానేజ్ చేసి గెలిచిన పరిపాలన ఇలానే ఉంటుంది. ప్రధాని మోదీని వేడుకుంటున్నా. ఏపీలో జరుగుతున్న దారుణాలను చూసి రాష్ట్రపతి పాలన విధించాలి. ఈవీఎంలు మ్యానేజ్ చేసి గెలిచిన పరిపాలన ఇలానే ఉంటుంది అని రోజా తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *