సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశం గర్వించదగిన జంటిల్ మెన్, ప్రేమికుడు,అపరిచితుడు ,రోబో వంటి భారీ బడ్జెట్ సినిమాలు 2దశాబ్దాలు క్రిందటే తీసిన అగ్ర దర్శకుడు శంకర్ గత 10 ఏళ్లుగా సరైన హిట్ లేక వెనుకబడ్డారు. అయితే తెలుగులో దిల్ రాజు నిర్మాణంలో గత 2 ఏళ్లుగా రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో తన గత సినిమాలను మించిన భారీ తనం చూపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రం క్లైమాక్ సిన్నివేశాలను చిత్రీకరించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో ఏకంగా 1200 మందికిపైగా ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టుల నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని శంకర్ ట్వీట్ చేశారు. ‘‘ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్ పూర్తయింది. దానితో దాదాపు సినిమా షూటింగ్ పూర్తీ అయ్యింది. ఇకపై ఫోకస్ అంతా ఇండియన్-2 పైనే! బుధవారం నుంచి సిల్వర్ బులెట్ సీక్వెన్స్‌లో నిమగ్నం’’ అని పోస్ట్ చేశారు. విశ్వనాయకుడు కమల్‌హాసన్ హీరోగా అనేక అవాంతరాల మధ్య ‘ఇండియన్2’ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. ఇటీవల తిరుపతి, టోక్యో ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే! దాదాపు 27 ఏళ్ల తర్వాత భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శంకర్. కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్ నాయికలు.
