సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలేజీ కంపాస్ లలో సెలెక్ట్ చేసిన విద్యార్థులకు జాబ్ పోస్టింగ్ కాల్ లెటర్స్ పంపడం లేదని, యువత తీవ్ర నిరాశ నిసృహలలో ఉంటున్నారని ఇటీవల వివాదం కేంద్రం దృష్టికి వెళ్లిన ఘటన అందరిని నివ్వెరపరచింది. మరో ప్రక్క, టీసీఎస్(TCS) భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. రాబోయే ఆర్థిక సంవత్సరం లో(2026 ఏప్రిల్ నుంచి) తమ ఉద్యోగుల సంఖ్యలో 2శాతం .. అంటే దాదాపు 12000 మందిని పైగా తొలగించడానికి సిద్ధం అవుతుంది. టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్ (K. Krithivasan) ‘మనీకంట్రోల్’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాజగా పేర్కొన్నారు. ఉద్యోగాల కోత నిర్ణయం అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.‘కొత్త సాంకేతికతకు పెద్ద పీట వేస్తున్నాము. మరీ ముఖ్యంగా ఏఐ, ఆపరేటింగ్ మోడల్ మార్పులను మేం గుర్తిస్తున్నాం. ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సన్నద్ధం కావాలి.అందుకోసం మేం ఏఐని వినియోగిస్తూ.. 2 శాతం ఉద్యోగుల కోత కు సిద్ధం అవుతున్నాము. సీఈవోగా నేను తీసుకొంటున్న అతి కఠిన నిర్ణయాల్లో ఇది ఒకటి’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *