సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్ నేడు, బాపట్ల జిల్లాలోని నిజాం పట్నం లో జరిగిన బహిరంగ సభలో ఈసారి వరుసగా 5వ ఏడాది ‘వైఎస్సార్ మత్స్యాకార భరోసా నిధుల విడుదల కార్యక్రమం లో పాల్గొన్నారు. ముందుగా సభా ప్రాం గణం వద్ద ఏర్పా టు చేసిన వివిధ స్టాళ్లను సీఎం జగన్ పరిశీలించారు. తదుపరి బహిరంగ సభలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం లో భాగంగా బటన్ నొక్కి రాష్ట్రంలోని 1,23,519 మత్స్య కార కుటుం బాల ఖాతాల్లోరూ.231 కోట్లు జమ చేసారు. . తాను చెప్పిన మాట ప్రకారం వేట నిషేధ కాలంలోనే భృ తి చెల్లిస్తున్నానని మత్యకారుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఓఎన్జీసీ పైపులైన్ ఏర్పా టుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్య కారులకు రూ.108 కోట్ల ఆర్థిక సాయంతో పాటు తన హయాంలో ఒక్కో మత్స్య కార కుటుంబానికి రూ. 10వేల చొప్పు న సాయం అందుతుందని ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.538 కోట్ల సాయం అందజేశామని ప్రకటించారు.
