సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం అసెంబ్లీ సమావేశాలలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసే అంశంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ను విపరీతంగా చూస్తూ పిల్లలు తమ భవిషత్తు నష్టపోతున్నారని ఇకపై వీల్లేదన్నారు. ఇటీవల తనకు సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనంపై ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఓ సిఫార్సు కూడా చేశారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 25 నూతన పాలసీలు తీసుకురావటం ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. వీటితో 23 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు.
