సిగ్మాతెలుగు డాట్ ఇన్,న్యూస్: గునుపూడి భీమవరం పట్టణం నందు వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు ది.1-04-2023నుండి ది.31-3-2025 వరకు అగు 2 సంవత్సరముల కాలంనకు దేవాలయం నందు జరుగు వివాహది శుభకార్యక్రమములకు వివాహ మండపములు వేసుకొను లైసెన్సు నకు టెండర్ కమ్ బహిరంగవేలం పాట నిర్వహించగా.. భీమవరం వాస్తవ్యులు, అనిశెట్టి మురళీకృష్ణ 1వ సం.నకు రూ.4,52,000/-లు 2వ సం.నకు రూ.4,97,200/-లకు హెచ్చుపాటగా పాడుకోవడం జరిగింది,. ఈ బహిరంగ వేల పాట యందు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీమతి కోడే విజయలక్ష్మి,ధర్మకర్తలు శ్రీమతి నాచు శ్రీ వల్లి, నల్లం రఘబాబు,లక్కు త్రిమూర్తులు, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ, పాల్గొనగా వర్థినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు, భీమవరం వారు పర్యవేక్షించారని దేవాలయ కార్యనిర్వాహణాధికారి ఎం అరుణ్ కుమార్ తెలిపారు.
