సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు శతాబ్దాలుగా అనుబంధం ఉన్న( ఆకివీడు దాటాక ..) కొల్లేరు లో శ్రీ పేదింట్లమ్మ దేవాలయానికి చేరుకోవడానికి చక్కటి రోడ్డు వెయ్యడం తో పాటు తాజగా కొత్త వంతెన ప్రారంభించడంతో, ఆలయం వద్ద భక్తులు ప్రశాంతంగా ఆధ్యాత్మికత పొందటానికి అనివేటి మహా మండపం ప్రారంభించడం తో గతంలో లా భక్తులు ఇకపై ఇబ్బందులు పడనక్కరలేదు. అక్కడ భక్తులకు సౌకర్యాలు కూడా బాగా పెరిగాయి. దశాబ్దాల కొల్లేరు ప్రజల చిరకాల కల సర్కారు కాల్వపై పెద్దింట్లమ్మ వారధిని, ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ తల్లి వారి ఆలయ అనివేటి మహా మండపాన్ని గత ఆదివారం కైకలూరు ఎమ్మెల్యే, దూలం నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ శ్రీధర్ కల్సి సంయుక్తంగా ప్రారంభిం చారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ 2009లో దివంగత వైఎస్సార్ వారధి నిర్మాణానికి రూ.12 కోట్లు కేటాయించారని, అయితే ఆయన మరణం తో పనులు నిలిచిపోయాయన్నారు. మరలా సీఎం జగన్ రూ.14.70 కోట్లను కేటాయించి వారధిని పూర్తి చేయడం కొల్లేరు, పశ్చిమ , కృష్ణ జిల్లా ప్రజలకు శుభపరిణామమన్నారు. వారధి నిర్మాణంతో కొల్లేరు గ్రామాలకు రవాణా సౌకర్యం మరింతగా పెరుగుతుందన్నారు. అలాగే కొల్లేరు గ్రామాల్లో నూతన రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.
