సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయం పై నేడు, శనివారం సీఎం చంద్రబాబు మరోసారి శాసన సభలో స్పందించారు. ముందుగా అనుకున్నట్లు విజయదశమి అక్టోబర్ 2వ తేదీన కాకుండా అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు వాహనమిత్ర ద్వారా 15 వేలు చప్పున ఆటో డ్రైవర్లకు అందజేస్తామన్నారు. అయితే ఆటో డ్రైవర్లు పెండింగ్ చలాన్‌లు ఉంటే క్లియర్ చేస్కోవాలని కోరారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే నియమాలు విడుదల చేశారు. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అందుతుంది.
