సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయేలా రామాయణం లాంటి ఇతిహాసంను తెలుగు నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో పాన్ ఇండియా సినిమాగా సుమారు 1500 కోట్ల బడ్జెట్ తో 4డి సినిమాగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు, నితీష్ తివారి దర్శకత్వంలో మరో రామాయణం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. .ఆదిపురుష్ విడుదలైన రెండేళ్లలోనే వస్తున్న ఈ చిత్రం మరింత గ్రాండియర్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతమ్మ తల్లిగా నటిస్తున్నారు. దశరధుడు గా అనిల్ కపూర్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్, విద్యుత్ జీవాగా వివేక్ ఒబెరాయ్ వంటి భారీ స్టార్ నటులు కనిపించనున్నారు.
