సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) ఇటీవల దేశవ్యాప్తంగా 15,762 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షలు జనవరిలో 10, 11 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసింయి. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను పొందుపరిచింది. అభ్యర్ధులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి తమకు పరీక్ష ఏ నగరంలో జరగనుందో, పరీక్ష కేంద్రం ఎక్కడ వంటి వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *