సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 16,347 నిరుద్యోగులకు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు కేటాయించి పారదర్శకంగా మెగాడీఎస్సీ ని పూర్తి చేశారని భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పోలీటీ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రకటనలో తెలిపారు.గత వైసిపి ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్షగట్టి గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలోని వారిని మద్యం షాపులు మరుగుదొడ్లు దగ్గర కాపలాకు ఉపయోగించి అవమాన పరిచారన్నారు. ఎన్నికలకి ముందు యువగళం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా వేలాదిమందిని ఉపాధ్యాయులుగా నియమించడం హర్షనీయనీయమన్నారు. తెలుగుదేశంపార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19 మధ్య రెండు మెగా డీఎస్సీలు నిర్వహించి 18 వేల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలుగుదేశంపార్టీ హయాంలోనే ఉపాధ్యాయులు లబ్ధి పొందారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *