సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాయంలో సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం వర్కుషాప్‌లో ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్‌లు హాజరయ్యారు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మీరు గ్రాఫ్ పెరిగేందుకు ఉపయోగించుకోండి.జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అందరూ ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతీ సచివాలయానికి ఎమ్మెల్యే, అధికారులు వెళ్లి కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. మీరు ప్రతి ఇంటికీ వెళితే మీ గ్రాఫ్ పెరుగుతుంది…వచ్చే ఎన్నికలలో మనం మొత్తం 175 స్థానాలలో గెలిచేలా ప్రయత్నించాలి. అది అసాధ్యం కాదు..మన ప్రభుత్వం చేసిన మంచి రాష్ట్రంలో 75 శాతం కుటుంబాలకు చేరింది. నా దగ్గర ఉన్న సర్వే ప్రకారం 18.మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తేల్చిచెప్పారు. ‘‘ వారి పేర్లు ఇక్కడ వెల్లడించను . వీరందరికీ త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి చెబుతాను.. అప్పటికీ పనితీరు మార్చుకోపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. లేకపోతె పార్టీకి నష్టమవుతుంది. మరల అక్టోబర్ లో మీ పనితీరు పరిశీలించి నిర్ణయం తీసుకొంటాను, చివరిలో మీరు నన్ను బాధ్యుడిని చేయవద్దు. మనం పచ్చ మీడియా విష ప్రచారానికి దీటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఉపయోగించుకొని అబద్దాలు, విషప్రచారాన్ని తిప్పికొట్టండి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.
