సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిడదవోలు లో భారీ బహిరంగ సభలో వైసిపి కాపు నేతల సమక్షంలో సీఎం జగన్ నాలుగో విడతలో వైఎస్సార్ కాపునేస్తం నిధులు విడుదల చేసిన కార్యక్రమంలో చంద్రబాబు అరెస్ట్ ఫై తొలిసారి మాట్లాడుతూ.. ఇటీవలే.. ప్రజల సొమ్ము 371 కోట్లు నిసిగ్గు గా కొట్టేసిన, అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు తొలిసారి అరెస్టయ్యారని అన్నారు. నిజానికి చంద్రబాబు 45 ఏళ్ళ రాజకీయ జీవితం అంత దోపిడీలు, అవినీతి, అతనిని నమ్మినవారికి వెన్నుపోట్లేనని ఆరోపించారు. ఇన్ని అక్రమాలు, అయితే దోపిడీలు చేసి దొరికేసి జైలులో ఉన్న గజదొంగ చందరబాబు ను రక్షించేందుకు సంఘంలో పలుకుబడి ఉన్న ఒక దొంగల ముఠా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం మీ అందరికి తెలిసిందేనని, చంద్రబాబు ప్రజలు నుండి చేసిన దోపిడీలో వీరందరూ భాగస్వామ్యులు కాబట్టే నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు సపోర్టు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర సంస్థలు ఐటి, ఈడీ , జి ఎస్టీ లు ఆధారాలతో ఆయన ముఠా లో కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశాయని, ప్రశ్నిస్తానని ప్రకటించిన వారు ప్రశ్నించకుండా జైలుకు వెళ్లి ఆయనతో ములాఖత్ పేరుతో మిలాఖత్ (పొత్తులు) పెట్టుకొంటున్నారని ఎద్దేవా చేసారు. ఆధారాలతో సహా ప్రజల సొమ్ము కొట్టేసిన అసలు దొంగను వదిలేసి ఎవరిని పట్టుకోవాలని ప్రశ్నించారు? తెలంగాణాలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పబ్లిక్ గా దొరికేసిన సరే బుకాయించాడని .. ఎన్నో దొంగతనాలు చేసి ఇప్పటికి దొరికాడని .. మన ప్రభుత్వంలో చట్టం ముందు అందరూ ఒక్కటేనని అన్నారు.
