సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత జూన్ నెల 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదలు దేశంలో అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌కు ముందు మోదీ ప్రభుత్వం వ్యాపార అవసరాల కోసం వంట గ్యాస్ వినియోగించే వినియోగ దారులకు కొద్దీ పాటి ధరలు తగ్గించింది. . నేటి నుండి అంటే జులై 1, 2024న 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. కానీ సామాన్య కుటుంబ మహిళలకు వంట ఇంటి అవసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. ఇకపై 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.30 తగ్గడంతో ఢిల్లీలో 19 కిలోల LPG గ్యాస్ ధర రూ.1646గా మారగా, తెలంగాణలో రూ. 1903.50కి చేరింది. ఏపీలో రూ.1832.50కి అందుతుంది. అయితే స్థానిక ప్రభుత్వ టాక్సలు తక్కువ ఉండటంతో . కోల్‌కతాలో రూ.1756కి అందుబాటులో ఉండగా, ముంబైలో రూ.1598, చెన్నైలో సిలిండర్ రూ.1809కి లభిస్తుంది.
