సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మధ్యతరగతి ప్రజలు ఆదాయాలు పెరగటం లేదు కానీ ధరలతో పాటు అన్నినిత్యవసరాలధరలు పెంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాల్లో ఉన్న ప్రజలకు నేటి శుక్రవారం నవంబర్ 1న తెల్లవారుజాము నుంచే చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. దీనితో చిన్నతరహా హోటల్స్ నుండి వాణిజ్య అవసరాలకు గ్యాస్ ఉపయోగించే అన్ని వర్గాలకు భారం పడుతుంది. ఇక చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం ఈ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 62 పెరిగి రూ.1802కు చేరుకుంది. అయితే ఇండ్లలో గృహిణులు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి పెంపుదల లేకపోవడం ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో చమురు కంపెనీలు ATF ధరలను కూడా పెంచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *