సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశంలో గృహ వినియోగదారులకు ఉపయోగించే 14న్నర కేజీల గ్యాస్ బండ ధరలు అడిగేవాడు లేడు అన్నట్లు పెరుగుతూ సుమారు దిగుమతి చార్జిలతో కలపి సుమారు 1200 ధరలకు చేరుకొంటున్న నేపథ్యంలో చిరు వ్యాపారులకు నేడు, సోమవారం మే డే సందర్భముగా తాజగా ఒక శుభవార్త అందింది. వ్యాపారం కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెట్రోలియం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.171.50 చొప్పున తగ్గించాయి. ఈ తగ్గింపు నేటి సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు లేదు. అంటే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటెయిల్ ధర ఢిల్లీలో రూ.1,856.50కు తగ్గింది. ముంబైలో ఈ ధర రూ.1,808కి తగ్గింది. అంతకుముందు ఈ నగరంలో ఈ ధర రూ.1,980 ఉండేది.
