సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో హోటల్స్ కు ఇతర వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల ధరలను భారీగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల అమ్మకం నేటి సోమవారం( సెప్టెంబర్ 1)నుంచి ప్రారంభంకానుంది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర 1631.50 రూపాయలు ఉండేది.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న తాజా నిర్ణయంతో 51.50 రూపాయలు తగ్గింది. గ్యాస్ సిలిండర్ 1,580 రూపాయలకే అందుబాటులోకి వస్తోంది. తగ్గిన ధరల కారణంగా హోటళ్లు, ఢాబాలు, టిఫిన్ బండ్లు, చిన్న స్థాయి ఫుడ్ బిజినెస్‌లకు కొద్దిపాటి ఊరట లభిస్తుంది.
