సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభుత్వ విప్ , భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, మంగళవారం ఉదయం భీమవరం మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. 66 లక్షల రూపాయలతో లోసారి మెయిన్ కాలువ నుండి డేగంపురం, కొమరాడ, అనకోడేరు మంచి నీటి చెరువులకు రా వాటర్ పంపింగ్ లైన్స్ ప్రారంభించారు. తదుపరి కొత్తముసలపర్రు గ్రామంలో 25 లక్షల రూపాయలు తో నిర్మించిన కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానికులతో మాట్లాడుతూ.. నా హయాంలో భీమవరం నియోజకవర్గంలో ఎక్కడ చుసిన కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన కొత్త సిసి రోడ్డులు , డ్రైనేజీలు, వంతెనలు, సచివాలయ భవనాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో పాటు ఎన్నో సంక్షేమ పధకాలు, పేదలకు ఇల్లు, స్థలాలు , నాడు- నేడు పాఠశాలల ఆధునీకరణ, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని ఇదంతా సీఎం జగన్ సంకల్ప బలం తో జరుగుతుందని .. అయితే ప్రజా అభివృద్ధికి , సంక్షేమ పథకాలకు ఆమడదూరం .. అవినీతికి దగ్గర ఉండే టీడీపీ నేతలకు జనసేన నేతలకు మాత్రం ఇవేమి కనపడని వారికీ, జగన్ సర్కార్ ఫై అబద్దాలు ప్రచారం చెయ్యడమే తెలుసునని .. ప్రజలు వాస్తవాలు తెలుసుకొని జగన్ సర్కార్ కు అండ గా నిలవాలన్నారు.
