సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరాంధ్ర లో పలు చోట్ల నేడు, గురువారం వర్షాలు పడుతున్నాయి, భీమవరం నిన్న సాయంత్రం భారీ వర్షం కురవగా నేటి ఉదయం నుండి ఒక మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రం వరకు మేఘావృతం అయిఉంది. జిల్లాలో పలు చోట్ల వర్షం పడింది. అయితే ఏపీ వ్యాప్తంగా రేపటి నుండి వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం దాని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఆవరించి ఉంది. రేపు శుక్రవారం అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలం గా ఉం టుందని మత్స్య కారులు ఈ రోజు నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
