సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులుగా మరల నష్టాలు చవిచూసిన దేశీయ స్టాక్ మార్కె ట్ సూచీలు తాజగా నేడు, గురువారం సాయంత్రానికి లాభాల్లో ముగిశాయి. భారత్ నుండి ఆటో దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అడ్జక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో నేటి ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు.. బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో మరల పుంజుకున్నాయి. అయితే ఆటో, ఫార్మా , టెలికమ్యూనికేషన్ షేర్లు మాత్రం నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ ఉదయం 77,087.39 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,288.50) నష్టాల్లో ప్రారం భమైం ది. చివరికి 317.93పాయింట్ల లాభంతో 77,606.43 వద్ద ముగిసింది. . నిఫ్టీ 105.10 పాయింట్లు లాభపడి 23,591.95 వద్ద ముగిసింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 85.79 గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్ , ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, L &T , అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభపడ్డాయి.
