సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్; ఉత్తర కోస్తా, రాయలసీమలలో కొన్ని ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు పడుతున్నప్పటికీ దాని ప్రభావంతో రాష్ట్రంలో ఎండ ప్రభావం ఉక్కబోత మరింత అధికంగా ఉంది. భానుడి ప్రతాపం ఓ వైపు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రతపై ఏపీ విత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు 97 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రేపు (ఆదివారం) 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. నేడు , రేపు ఆదివారం ఎక్కువ వడగాల్పులు వీచే మండలంలో పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి, మన్యం జిల్లాలు లో ఎక్కువ మండలాలు ఉండటం గమనార్హం. భీమవరం లో అయితే నేటి శనివారం ఉదయం 8 గంటల నుండి ఎండలు వడగాల్పు దంచి కొడుతోంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *