సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో భారత్ స్టాక్ మార్కెట్ వరుసగా 2వ రోజు నేడు, గురువారం కూడా భారీ నష్టాలను చవి చూసింది. విదేశీ సంస్థాగత మదుపర్లు కూడా అమ్మకాలకు దిగుతుండడం ..మొన్న మంగళవారం విదేశీ మదుపర్లు 6, 516 కోట్లు విలువైన షేర్లును అమ్మేసారు. నిన్న సెలవు.. ఇక మొన్న మంగళవారం ముగింపు (80, 786)తో పోల్చుకుంటే నేడు గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి.చివరకు సెన్సెక్స్ 705 పాయింట్ల నష్టంతో 80, 080 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 211 పాయింట్ల నష్టంతో 24, 500 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 718 పాయింట్లు కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ 630 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ దారుణంగా 87.63గా ఉంది.
