సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రేమ కధ సినిమాలలో నిజంగా భిన్నమైన సినిమా గ దాదాపు 2 దశాబ్దాల క్రితం 2004లో తెలుగు తమిళ్ లో సంచలన విజయం సాధించిన 7/జి బృందావన్‌ కాలనీ. సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇప్పటికి యువన్ శంకర్ రాజా సంగీతం తో మ్యూజికల్ గా క్లాసిక్ హిట్ గా నిలిచింది ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మాతగా అయన చిన్న కొడుకు రవికృష్ణ హీరోగా నిర్మించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సోనియా అగర్వాల్‌, హీరో తండ్రిగా కీలక పాత్రలో చంద్రమోహన్ నటించారు. ఇక ఈ సినిమా కథ మన పక్కన ఇంట్లోనో.. లేక మన వీరిలోనో జరిగే స్టోరీలా ఉంటుంది. . ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సినిమా తర్వాత రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ లు పెద్దగా పామ్ లోకి రాలేకపోయారు. ఇప్పుడు 7/జి బృందావన్‌ కాలనీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్. తాజాగా ఈ మూవీపోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరు నటిస్తున్నారని ప్రేక్షకులందరూఎదురుచూస్తున్నారు. మరి కంటిన్యుటీ కోసం రవికృష్ణ హీరోగా మరోసారి నటిస్తాడా? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *