సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రానున్న నాలుగురోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలో రుతుపవనాలు మందగించడంతో ఆకాశం మేఘావృతమై ఉన్నా. ఒక మోస్తరు వర్షాలకే పరిమితం అవుతున్నాయి. నేడు, సోమవారం ఉదయం నుండి భీమవరం లో వాతావరణం మేఘ వృతం తో చిరు జల్లులు కురుస్తున్నాయి. గత రాత్రి కాస్త వర్షం పడింది. అయితే . వాతావరణం మాత్రం వేడిగా ఉండే అవకాశం ఉంది. వేడితో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో పగలు ఎండ ఎక్కువగా ఉండి, రాత్రికి వర్షం కురుస్తోంది. ఇక నేడు, సోమవారం గోదావరి జిల్లాలతో పాటు కోస్తా ఆంధ్ర అంతటా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది.
