సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం ప్రధమం శ్రీ గణేష్ ను తలచుకొంటాం. మరి ఈ కొత్త ఏడాది.. మొదటి నెల.. తొలి వారంలోనే.. అంటే జనవరి 6వ తేదీన ఈ సంకట హర చతుర్థి వచ్చింది. నేడు, మంగళవారం రోజు అత్యంత అరుదైన రోజని పండితులు చెప్పఁడంతో భీమవరం లో అన్ని శ్రీ వినాయక స్వామి, శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ రోజు ఆశ్లేష నక్షత్రం. ఆదిశేషుడు.. నాగేంద్ర స్వామి వారి నక్షత్రం.శ్రీ వినాయకుని అర్చనతో పాటు రెండు తలల నాగరాజుకు నేడు అభిషేకం చేస్తే కోరిన కోరికలు శీఘ్రగతిన నెరవేరుతాయని పండితులు పేర్కొనడంతో.. ఆవుపాల అభిషేకాలు విశేషంగా జరిగాయి. నేడు మంగళవారం ఉదయం 11.37 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 10.46 గంటల వరకు చవితి తిథి ఉంటుంది. చవితి తిథి.. చంద్రోదయం సమయం ఉంటుందో అప్పుడే సంకట హర చతుర్థి జరుపుకోవడం శుభకరం.. అంటే మంగళవారం, బుధవారం కూడా చతుర్దశి జరుపుకొనే అరుదయిన అవకాశం భక్తులకు ఉంది.
