సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం లో వారాహి వాహనంఫై టీడీపీ మాజీ ఎమెల్య వర్మ ను ప్రక్కన నిలబెట్టుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గత రాత్రి జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సిద్ధం బస్సు యాత్రలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్న తాను పేదోడ్ని.. పేద ప్రజల మనిషిని అంటున్న వ్యాఖ్యలను ప్రజలు నమ్మకండి.. వందల కోట్ల రూపాయిల విలువ కలిగిన కంపెనీలు ఉన్న జగన్ ఎలా పేదవాడవుతాడు? 20వేల కోట్లు ప్రజల సొమ్ము దోచుకుంటున్న వైసీపీ అధినేత ఎలా పేద ప్రజల మనిషి అవుతారంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం మొత్తం అవినీతి రాజ్యమేలుతుందని, వైసీపీ నాయకులు కమీషన్లు లేకుండా ఏ పని చేయని పరిస్థితి నెలకొందన్నారు. అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించాలని తమ కూటమి ని గద్దె నెక్కిస్తే అవినీతిలేని పాలన అందిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం ప్రజలు తనను నమ్మి, గెలిపించి అసెంబ్లీ కి పంపిస్తే రాష్ట్ర అభివృద్ధి తో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కి కృషి చేస్తానని , తమ అబ్బాయి రాంచరణ్ భార్య ఉపాసన తో కలసి ఇక్కడే ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి కూడా నిర్మిస్తామని పవన్ హామీ ఇవ్వడం కొసమెరుపు..
